Header Banner

వాట్సాప్‌ కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌తో వినియోగదారులకు సర్‌ప్రైజ్! గ్రూపుల్లో 256 మంది వరకు..

  Sun May 25, 2025 15:20        Technology

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తన యూజర్ల అనుభూతిని మరింత మెరుగుపరిచే దిశగా మరో కీలక అడుగు వేసింది. గ్రూపు సంభాషణలను మరింత సులభతరం చేస్తూ, ఆసక్తికరంగా మార్చేందుకు 'వాయిస్ చాట్' అనే సరికొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇదివరకే ఉన్న గ్రూప్ వాయిస్ కాల్స్‌కు భిన్నంగా, ఈ వాయిస్ చాట్ ఫీచర్ గ్రూపు సభ్యులకు ఓ నూతన అనుభూతిని అందించనుంది. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? దీని ప్రత్యేకతలేంటి? తెలుసుకుందాం పదండి. సాధారణంగా వాట్సాప్ గ్రూపులో వాయిస్ కాల్ చేస్తే, గ్రూపులోని సభ్యులందరి ఫోన్లు ఏకకాలంలో రింగ్ అవుతాయి. ఇది కొన్నిసార్లు సభ్యులకు ఇబ్బందిగా పరిణమించవచ్చు. ఈ సమస్యను అధిగమిస్తూ, 'వాయిస్ చాట్' ఫీచర్‌ను వాట్సాప్ రూపొందించింది.

ప్రారంభించడం సులువు: 33 మంది సభ్యుల కంటే ఎక్కువ ఉన్న పెద్ద గ్రూపుల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. గ్రూప్ చాట్ విండో పైభాగంలో, కుడివైపున కొత్తగా 'వేవ్‌ఫార్మ్' (ధ్వని తరంగం) ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయగానే, "స్టార్ట్ వాయిస్ చాట్" అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా వాయిస్ చాట్‌ను ప్రారంభించవచ్చు.

రింగింగ్ ఉండదు, నోటిఫికేషనే: వాయిస్ చాట్ ప్రారంభించినప్పుడు, గ్రూపులోని సభ్యుల ఫోన్లు రింగ్ అవ్వవు. బదులుగా, వారికి ఒక నిశ్శబ్ద పుష్ నోటిఫికేషన్ మాత్రమే వెళ్తుంది. గ్రూప్ చాట్ విండోలో కూడా ఒక బ్యానర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి ఎవరైనా వాయిస్ చాట్‌లో చేరవచ్చు. దీనివల్ల, ఆసక్తి ఉన్నవారు మాత్రమే సంభాషణలో పాల్గొనే వెసులుబాటు కలుగుతుంది.

 

ఇది కూడా చదవండి: జర జాగ్రత్త..! 200మందికి పైగా కరోనా కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్.!



ఎప్పుడైనా చేరొచ్చు, వెళ్లిపోవచ్చు: వాయిస్ చాట్ కొనసాగుతున్నంత సేపు, గ్రూపు సభ్యులు ఎవరైనా తమకు వీలైనప్పుడు చాట్‌లో చేరవచ్చు లేదా నిష్క్రమించవచ్చు. చాట్ నుంచి బయటకు వచ్చినా, గ్రూప్ చాట్ స్క్రీన్ పైభాగంలో వాయిస్ చాట్ కంట్రోల్స్ కనిపిస్తూనే ఉంటాయి. మ్యూట్ చేయడం, హ్యాంగ్ అప్ చేయడం వంటివి ఇక్కడి నుంచే చేసుకోవచ్చు.

మల్టీ టాస్కింగ్ సౌలభ్యం: వాయిస్ చాట్‌లో ఉంటూనే, అదే గ్రూపులో టెక్స్ట్ మెసేజ్‌లు పంపడం, మీడియా ఫైల్స్ చూడటం వంటివి యధావిధిగా చేసుకోవచ్చు. ఇది గ్రూప్ కమ్యూనికేషన్‌ను మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది.

భద్రతకు పెద్దపీట: వాట్సాప్‌లోని అన్ని సంభాషణల మాదిరిగానే, ఈ వాయిస్ చాట్‌లు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితంగా ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.

ఆటోమేటిక్ ముగింపు: వాయిస్ చాట్‌లో చివరి వ్యక్తి నిష్క్రమించిన తర్వాత, లేదా 60 నిమిషాల పాటు ఎవరూ చేరకపోతే, వాయిస్ చాట్ ఆటోమేటిక్‌గా ముగుస్తుంది.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #WhatsUpNewfeatures #whatsappnewfeaturesUpdate #BusinessandChannels #AISupport #WhatsAppAIfeature #WhatsAppNewFeaturesAIFeature